నలుగురు వార్డు సభ్యులతో కలిసి బీఆర్ఎస్ లో చేరిన నేరడగం సర్పంచ్
: పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3మాగనూర్: మండల పరిధిలోని నేరడగం గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన దాసరి వెంకటమ్మ గత ఏడాది కాలంగా గ్రామంలో అభివృద్ధి పనులు జరగకపోవడం, ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేరెడ్గం సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు నలుగురు వార్డ్ మెంబర్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.ఈ చేరికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు అశోక్, ప్రకాష్, చాలీమ్, పరందాములు తో పాటు మోహన్ గౌడ్, మేస్త్రీ అంజి, శివరాం, టెంట్ అశోక్, నరేష్, పాండు, బస్వరాజ్, చాందుపాషా తదితరులు సుమారు 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.