PS Telugu News
Epaper

కాట్రపల్లి గ్రామంలో సీసీ రోడ్ శంకుస్థాపన మరియు హైమాస్ట్ లైట్లు ప్రారంభం

📅 26 Mar 2026 ⏱️ 6:23 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

//పయనించే సూర్యుడు// //మార్చ్27మక్తల్ //

నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామంలో ఇటీవల పాలమూరు ఎంపీ డి.కే. అరుణమ్మ నిధులతో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులు సాంక్షన్ చేయబడినవి. ఇందులో భాగంగా 232 మీటర్ల సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, తన చేతుల మీదుగా సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా, ఇటీవల ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు కూడా ఈరోజు బి. కొండయ్య చేతుల మీదుగా ప్రారంభించి, గ్రామానికి అంకితం చేశారు.ఈ కార్యక్రమంలో కాట్రపల్లి గ్రామ సర్పంచ్ గంటా బాలరాజు, నారాయణరెడ్డి, ఓబులేష్, భూత్పూర్ కురువ హనుమంతు, బ్యాటరీ రాజు, బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.కాట్రపల్లి గ్రామ ప్రజలు పాలమూరు ఎంపీ డి.కే. అరుణమ్మ కి గ్రామ అభివృద్ధికి చేసిన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top