కాట్రేనికోనలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వరరావు,తహసీల్దార్ రవికిరణ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు,ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సోమవారం వచ్చిన మూడు వినతులను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. మండల స్థాయి అధికారులందరూ సమయపాలన పాటిస్తూ తప్పనిసరిగా హాజరుకావాలని,తమ శాఖలకు సంబంధించిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల ఎస్ ఐ సత్యనారాయణ,వ్యవసాయ అధికారి మృదుల,గృహ నిర్మాణ సహాయ ఇంజనీర్ వేణు,మండల విద్యాశాఖ అధికారి కృష్ణమోహన్, ఉప అభివృద్ధి అధికారులు శంకర్ నారాయణ,సూర్యనారాయణ రాజు,సహాయ పథక అధికారి శ్రీనివాస్, వైద్యాధికారి శేషుబాబు, మండల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.