భీంగల్ మున్సిపల్ కమిషనర్ కి కౌన్సిలర్ నీలం రవి సమస్యల మీద వినతి పత్రం .

September 21, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.21.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. మున్సిపల్ కమిషనర్ కి,భీంగల్ మున్సిపాలిటీ.
విషయం: భీంగల్ వెజ్ & నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో వర్షపు నీటితో ఏర్పడుతున్న బురద సమస్యను పరిష్కరించి, చిప్స్ మరియు డ్రైనేజీపై ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని వినతి.కమిషనర్ కి,భీంగల్ పట్టణంలోని వెజ్ & నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో వర్షం పడిన ప్రతిసారి బురద ఏర్పడి వ్యాపారులు, రైతులు, మార్కెట్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గత సంవత్సరం నుంచే మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కల్పించకపోవడం బాధాకరం.తైబజార్ ద్వారా మున్సిపాలిటీకి సుమారు రూ.10.50 లక్షల ఆదాయం వస్తున్న నేపథ్యంలో, ఆ నిధుల ఉద్దేశ్యం మార్కెట్‌లో వ్యాపారులు, రైతులు మరియు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కదా? మరి వర్షం పడితే నడవడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది?కాబట్టి మార్కెట్‌లో వచ్చే వారం లోపు తప్పనిసరిగా:బురద ఏర్పడకుండా చిప్స్ వేయాలి
డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి డ్రైనేజీపై ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలి మార్కెట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలిపేద, మధ్యతరగతి వ్యాపారులు, రైతులు మరియు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.వచ్చే వారం లోపు పనులు ప్రారంభించకపోతే, మార్కెట్ కమిటీ రైతులు మరియు వ్యాపారులతో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది.మార్కెట్ కమిటీ రైతులు & వ్యాపారులు భీంగల్

🌐 Select Language:
📰 ePaper