వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి 14 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు – ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గాయత్రి నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వత్ నగర్, టీమ్ శక్తి సేన – తులసి నగర్, గాయత్రి నగర్, ఇండోర్ షటిల్ కోర్టు పక్కన పర్వత్ నగర్, శ్రీ చైతన్య స్కూల్ రోడ్ నంబర్ 9, శ్రీ వివేకానంద నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు 14 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, క్షేమంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరినీ ఐక్యం చేసే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలని, భక్తిశ్రద్ధలతో పాటు సోదరభావం, ఐక్యత, సేవా స్ఫూర్తితో ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు.అనంతరం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించి, నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.