కాట్రేనికోన డిసిసి బ్యాంకు వద్ద సహకార ఉద్యోగుల ఆందోళన
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండలంలోని ఏడు సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కాట్రేనికోన డిసిసిబి వద్ద ఆందోళన చేపట్టారు. మానవహారం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా సహకార సంఘ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు య ర్రం శెట్టి రామచంద్రరావు, ఆధ్వర్యంలోఈ రోజు అనగా రెండవ రోజు సమ్మె లో భాగంగా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద మండలం లో సహకార సంఘాల సిబ్బంది మానవహారం నిర్వహించి. బ్రాంచ్ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అద్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు, మరియు అప్పారి సత్య ప్రేమేశ్వరరావు, కోటిపల్లి శ్రీ రామ వర ప్రసాద్, కోటిపల్లి సీతారామారావు, గుత్తుల వెంకట శ్రీనివాస్, విత్తనాల శంకర్, గుబ్బల నాగేంద్ర కుమార్, మరియు, యర్రంశెట్టి నాని,పీ. వరహాల రాజు, శరత్,సురేష్, నాగ భూషణం, సత్తిబాబు, వర్మ, సుబ్రహ్మణ్యం, కిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
