కాట్రేనికోన పిహెచ్ఈ లో గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సర్టిఫికెట్
పయ నించే సూర్యుడు మార్చి 11 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ బుధవారం వ్యాక్సిన్లు వేయించుకున్న బాలికలకు సర్టిఫికెట్లు అందజేశారు. పదిమంది బాలికలకు బుధవారం గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ లను వేసినట్లు పిహెచ్సి వైద్యురాలు లిఖిత తెలిపారు.ఈ సందర్భంగా వైద్యాధికారి లిఖిత మేడం మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ , ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలు ఖర్చుచేసి గవర్నమెంట్ సరఫరా చేయుచున్నారు 14 సంవత్సరాలు కలిగిన బాలికలు ప్రతి ఒక్కరు వేయించుకోవాల్సిందిగా తెలియపరిచినారు ఈ వశ్యకత గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో మోకా బాల ప్రసాద్,నూకలదుర్గ,బీమాల సూరిబాబు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెచ్ సి శేషుబాబు, సూపర్వైజర్స్, ఫార్మసిస్ట్ గోపి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు