పయనించే సూర్యుడు సెప్టెంబర్23:_ ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) సేవా మిత్ర చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ ఆర్చి నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు.పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని,పాఠశాల పూర్వ వైభవాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు.ఈ ఆర్చి నిర్మాణంతో పాఠశాలకు మరింత గుర్తింపు వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దాకమారి నాగ మణీశ్వరరావు,అధ్యక్షులు కె.పెద్దిరాజు, జె.దుర్గాప్రసాద్, వెంట్రు ప్రసాద్, కోలా త్రిమూర్తులు,ప్రధానోపాధ్యాయులు ఒరిగల జగపతి,ఎలిపే వెంకటేశ్వరరావు,తంబి,కోటిపల్లి సత్యనారాయణ, కాట్రూ అప్పారావు, చెరుకు గుప్తా, పాలగుమ్మి రాంబాబు, మంగం శ్యామ్ సుందర్,చింతా వేణుగోపాల్, చెల్లూరి రాజబాబు, వట్టూరి బాబీ, బొమ్మిడి రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.