పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలోని ఈగల్స్ యూత్ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండపం వద్ద ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్‌గల్ పట్టణానికి చెందిన సయ్యద్ రెహమాన్‌ను ఘనంగా ఆహ్వానించి ఆత్మీయంగా సన్మానించారు.ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ.. తనను ఆహ్వానించి సన్మానించిన ఈగల్స్ యూత్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యువత చూపుతున్న ఆత్మీయత, అభిమానం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. యువత ఐక్యతతో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈగల్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.