PS Telugu News
Epaper

కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు

📅 07 Mar 2026 ⏱️ 6:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 7 కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ 2 వెంకటరమణ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి 501 మంది వీరిలో బాలురు 243, బాలికలు 258, ప్రైవేటు పాఠశాలల నుండి 54 మంది హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని చెయ్యేరు,కాట్రేనికోన, కందికుప్ప మూడు సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. గచ్చకాయల పోరా హై స్కూల్ కు చెందిన 30 మంది విద్యార్థులు ఎన్ కొత్తపల్లి హైస్కూల్లో పరీక్షలు రాస్తారని, చెయ్యేరు గున్నేపల్లి కి చెందిన 18 మంది విద్యార్థులు చెయ్యేరు స్కూల్లో రాస్తారని ఎంఈఓ వివరించారు.

Scroll to Top