కాట్రేనికోన హైస్కూల్లో డి ఈ ఓ విచారణ

August 17, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 17 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ రోజున విద్యార్థులకు ఖాళీ ప్రశంసా పత్రాలు అందించడం పట్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ భాష విచారణ చేపట్టారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన డీఈవో సోమవారం పాఠశాలను సందర్శించి హెచ్ఎం ను వివరణ అడిగారు. భవిష్యత్తులో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాల హెచ్ఎం అంబ డిఈఓ కు సంజాయిషీ లెటర్ వ్రాసి ఇచ్చారు. అనంతరం తరగతి గదులను పరిశీలించిన డీఈవో ఉపాధ్యాయులు బోధనపై విద్యార్థులును అడిగి తెలుసుకున్నారు. పరీక్ష తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా డిఇఓ సూచించారు. ఆయన వెంట ఎంఈఓ వెంకటరమణ పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper