ద్రాక్షారామంలో వాజపేయి వర్ధంతి
పయనించే సూర్యుడు ఆగస్టు 17 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల బిజెపి అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, బిజెపి నాయకుల ఆధ్వర్యంలో దివంగత అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆకేటి శ్రీకృష్ణ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసి రాజనీతిజ్ఞులుగా పేరుగాంచి, ప్రధానిగా అణుబాంబు తయారీ, రహదారుల నిర్మాణం వంటి దేశానికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, దివంగత మాజీ ప్రధాని వాజపేయి ఎందరికో ఆదర్శనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు పుల్లెల రామమూర్తి, అయ్యప్ప, ఉపాధ్యక్షులు దక్షిణామూర్తి, చింతా సత్యనారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు రాయుడు వీరవెంకట రామకృష్ణ, ఓ.బి.సి. అధ్యక్షులు ఇంధన సత్యనారాయణ తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.