కాట్రేని కోన మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ*

July 1, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జులై 1 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామ పంచాయతీ వేట్లపాలెం, కందికుప్ప గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో, మత్స్య శాఖ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు నాగిడి నాగేశ్వరరావు, కాట్రేనికోన మండలం డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు ఆకాశం శ్రీనివాస రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.పేద, బడుగు, బలహీన వర్గాల సామాజిక భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కార్యక్రమంలో పంచాయతీల స్వర్ణ గ్రామ సిబ్బంది, &నాయకులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper