PS Telugu News
Epaper

కామోల్ గ్రామంలోశ్రీ గీత మహా యజ్ఞ కార్యక్రమం

📅 24 Mar 2026 ⏱️ 2:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ గీతా మహాయజ్ఞం భక్తుల ఆధ్యాత్మికోత్సాహాన్ని మరింత పెంచుతోంది. ఈ యజ్ఞాన్ని శ్రీహరి మౌనస్వామి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, కీర్తనలు జరుగుతుండగా, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. శ్రీరాముని కృపతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొని, ఆధ్యాత్మిక చైతన్యం విస్తరిస్తోంది.ఈ మహాయజ్ఞం ద్వారా ప్రజలకు ధర్మం, సనాతన సంస్కృతి, భగవద్గీత సందేశాలను చేరవేయడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ నవమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Scroll to Top