కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
-. ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు, అని అక్క మరణం తీరని నష్టం అని ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి. అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో కామ్రేడ్ కర్నాటి అనసూయ ప్రథమ వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ కర్నాటి అనసూయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు హార్పించి వర్ధంతి సభను నిర్వహించారు..ఈ సందర్బంగా ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతు: కమ్యూనిస్టు ఉద్యమంలో సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ భద్యత మేరకు తన భర్త కామ్రేడ్ కర్నాటి యాదగిరి నల్లగొండ జిల్లా నుంచి నిజామాబాద్ కు రావడంతో తనతో పాటే ఇక్కడికి వచ్చి పార్టీ కార్యకర్తలకు ఎంతో ప్రేమ పాత్రురాలు అయింది అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు అర్ధరాత్రి వచ్చిన భోజనాలు పెట్టిన మాతృమూర్తి ఆమె అన్నారు. పోలీస్ నిర్భంధాల్లో, కష్టాలో కార్యకర్తలకు అండగా ఉండి విప్లవొద్యమాలకు వెన్ను, ధన్ను గా నిలబడ్డ ఆదర్శ కమ్యూనిస్ట్ యోధురాలు అని ఈ సందర్బంగా కొని యాడారు. ఎన్ని కష్టాల్లో అయినా పార్టీ కోపం పరితపించి ఆణిముత్యం అన్నారు.కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్క ఆశయాలను ముందుకు తీసుకోని పోవడమే ఆమెకు నిజమైన నివాళులు హార్పించినట్టు అన్నారు. అక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవడానికి అందరం కృషి చేయాలని పిలుపును ఇచ్చారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్తేవ్వ, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు పి రమ, ప్రధానకార్యదర్శి ఆర్ పుష్పలత, జిల్లా నాయకురాలు ఎస్ నర్సక్క, జి పద్మ, సిరికొండ మండల అధ్యక్షురాలు ఇ జమున, డివిజన్ నాయకులు వి రాధా, లక్ష్మి, కె భాగ్య, ఇ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.