PS Telugu News
Epaper

కామ్రేడ్ రవన్న స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దాం

📅 09 Mar 2026 ⏱️ 4:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

భారత దేశంలో దేశ పరిస్థితులకు అనుకూలంగా సరి అయినా పంథా, విప్లవపంథా కోసం చివరిదాకా పోరాడిన విప్లవయోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ( రవన్న) 10 వ వర్ధంతి నీ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కుమార్ నారాయణ భవన్ లో నిర్వహించడం జరిగింది . *రవన్న చిత్ర పటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లైన్ (ప్రజా పంథా) ముఖ్య వక్త గా జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం లు మాట్లాడుతూ . సిపిఐ ఎంఎల్ లైన్( ప్రజా పంథా) రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుధీర్గకాలంగా రహస్యంగా పని చేశాడు కామ్రేడ్ రాయల రవన్న 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి భారత దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవపంథా ఉండాలని విప్లవకారులు ఐక్యంగా పనిచేయాలని తన చివరిదాకా ఊపిరి ఉన్నంతకాలం విప్లవోద్యమ నాయకుడిగా పని చేశారన్నారు. భారత దేశ సమకాలిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజాపంథా లైన్ ను మరింతగా బలపరచుకొని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కామ్రేడ్ రాయల గారి స్ఫూర్తితో మరింత ఉత్తేజంతో విప్లవోద్యమాలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. పిడివాద తదితర ధోరణులను ఎదుర్కొని బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణానికి విప్లవ సైనికులంతా పూనుకోవాలని పిలుపునిచ్చారు. విప్లవోద్యమ నిర్మాణానికి వాటి రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పనిని సమన్యాయం చేస్తూనే నిజాంబాద్ వరంగల్ ఖమ్మం ఉభయగోదావరి జిల్లాలలో ఆనాటి పీపుల్స్ వారి జనశక్తి ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన దాడులను ఎదుర్కోవడానికి తన దళంతో ప్రజలతో ఉండి ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టాడు కార్యకర్తలను ఉద్యమాన్ని రక్షిస్తూ కృషిలో అలుపు లేకుండా వెనకకు ముందుకు చూడకుండా వెలిచాడు అంతేకాకుండా మహబూబ్నగర్ నుంచి ఉత్తరాంధ్ర దాకా పార్టీ నిర్మాణయుతంగా పని చేయించడానికి తన శక్తిని ఉపయోగించారు. కామ్రేడ్ రవి అన్న ప్రజాపంద బాటలో విధానాన్ని నమ్మిc ఆచరించాడు అతివాద మితవాద పేట దొరలను వ్యతిరేకించాడు ప్రతి కమ్యూనిస్టు ప్రజలతో మరింత సన్నిహితంగా అభిమాన నాయకుడిగా ఎదగాలని కోరుకున్నాడు తన ప్రత్యేక కృషి ద్వారా ఎందరో కార్యకర్తలు నాయకులను సానుభూతిపరులను తయారు చేశాడు నిత్య కృషి వరుడు జీవితాన్ని విప్లవానికి సార్ధకంగా మలుచుకున్నాడు 1984 సిద్ధాంత పోరాటంలో 20 సంవత్సరాల సమీక్ష అడవి ఉద్యమ పాట లో రచనలో ఆ తర్వాత ప్రజాపంధా రాజకీయాలలో ముఖ్య పాత్ర ఉన్నదానివారన్నారు. ఆయన స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ పేరుతో మావోయిస్టు ఉద్యమాన్ని వెన్నెముక విడిచి కేంద్ర ప్రభుత్వం ఇతరుల పైన విరుచుకుపడడానికి కనీస ప్రజాస్వామిక వాంఛలను ప్రశ్నలను అదీకరించడం నిరంకుశ పద్ధతులకు దిగుతుందని మావోయిస్టు పార్టీ యొక్క తాజా ఫలితాలు కూడా వారి తప్పుడు దృక్పథం నుంచి యేర్పడిననేనని కామ్రేడ్ రవన్న బోధనల ద్వారా మనకు అర్థమవుతుంది వారన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా సహాయ కార్యదర్శి పి. రామకృష్ణ , జిల్లా నాయకులు ముత్తన్న , సురేష్ , జి కిషన్ , సతక్క , బాబన్న ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్ , ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు ఏపీ గంగన్న, యు రాజన్న ,ఎస్ దుర్గాప్రసాద్, ఏ సాయిలు నరేందర్ వివిధ ప్రజాసంఘాల నాయకులు డి. నిఖిల్ , పద్మ ,సునీత, లక్ష్మి, అరవింద్, పోషన్న లింబన్న, రవిలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top