PS Telugu News
Epaper

కార్తికేయ–ప్రియాంక–సితార పిక్ నెట్టింట వైరల్

📅 26 Nov 2025 ⏱️ 3:11 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :దర్శకధీరుడు రాజమౌళి త‌న‌యుడు, యువ నిర్మాత కార్తికేయ ఇటీవల తన 34వ పుట్టిన‌రోజును జరుపుకున్నారు. వారణాసి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు X వేదికగా బర్త్ డే విషెష్ తెలిపారు. వారణాసి సెట్లో కార్తికేయతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ.. మహేష్ ఆకాశానికెత్తేశారు. మేం నిర్మించే ప్రతి అద్భుతం వెనుకుండే నిశ్శబ్ద శక్తివి నువ్వే. ఎంతో కష్టమైన పనులను కూడా ఎంత కూల్గా చక్కబెడతావో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మున్ముందు గొప్ప సక్సెస్ అందుకుంటావు” అని మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇపుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వారణాసి సినిమా ప్రయాణంలో నీతో కలిసి డాన్స్‌ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రియాంక చోప్రా రాసుకొచ్చింది. వీడియోలో కార్తికేయతో క‌లిసి సరదాగా స్టెప్పులేసింది. మహేష్‌బాబు తనయ సితార కూడా తన సోషల్‌మీడియా హాండిల్‌లో కార్తికేయకి బర్త్‌డే విషెస్ తెలిపింది. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి మధు చోప్రా, నమ్రత, కార్తికేయతో తీసుకున్న ఫొటోను షేర్‌ చేసింది. ఆ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇటీవల RFC లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడంలోనూ కార్తికేయ తనదైన పాత్ర పోషించారు. తండ్రి రాజమౌళి ఆలోచనలకు తగ్గట్టుగా, తన పనితీరును క్రియేటివ్గా ముందుకు తీసుకెళ్లడంలో కార్తికేయ సమర్ధుడు. ఈ విషయాన్నీ RRR మూవీతోను నిరూపించాడు. ఇపుడు ‘వారణాసి’కి కూడా మరోసారి వర్క్‌ చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న వారణాసి 2027 సమ్మర్‌లో రిలీజ్‌ రానుంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. దేవాకట్టా డైలాగ్స్ అందిస్తున్నారు.

Scroll to Top