కార్తీక్ పౌర్ణమి దీపోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన సీఐ
పయనించే సూర్యుడు నవంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవం ఏర్పాట్లను ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై జిలాని పరిశీలించారు. చెరువులో నేటి సాయంత్రం మహిళలు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించే సందర్భంగా చెరువు వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చెరువు లోతును పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. దీపాలు వెలిగించేందుకు చెరువు లోపల వరకు మహిళలు వెళ్లకుండా చెరువు వద్ద పోలీసులను ఉంచి ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, టిడిపి యువనేత పిడికిటి. వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ గందల్ల వేణు తదితరులు హాజరయ్యారు..ఇటీవల చెరువు వద్ద జరిగిన ప్రమాదం దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెరువు నిండుగా లోతుగా ఉండటంవల్ల ఎవరు కూడా చెరువు లోపల వైపుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని సీఐ తెలిపారు.