కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 5 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మెయిన్ బజార్ లో వెలిసిన శ్రీపెద్దమ్మ తల్లికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం సుప్రభాతసేవ పంచామృత అభిషేకము గంగా పూజ లలితా సహస్రనామావళి మహా మంగళారతులు మొదలైన పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంకాలం గాజుల అలంకరణ చేసి కోటి వత్తులతో కార్తీక దీపోత్సవం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని యాడికి పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేసినారు.
