PS Telugu News
Epaper

కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

📅 06 Jan 2026 ⏱️ 7:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్

విబిజీ రామ్ జీ మిషన్ వెంటనే రద్దు చేసి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
-.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల స్పష్టికరణ.కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ ఎత్తేసే కుట్రలకు పునుకుంటున్నదని అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నాడు సిరికొండ మండల కేంద్రంలో సొసైటీ మీటింగ్ హాల్ లో అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల, ప్రజాసంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరు అయి ప్రసంగిస్తు: కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి సంపన్నుల కొమ్ముఖాస్తు పేదల కడుపు కొడుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం హాయంలో వామపక్షాల పోరాటాలతో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి కూలీలకు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. కూలీలకు ఉపాధి భరోసాను ఇచ్చింది అన్నారు.కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం చాలా కాలంగా ఉపాధిహామీనీ నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్ని ఇప్పుడు మొత్తం కూలీలకు ఉపాధి లేకుండానే చెయడానికి యుద్ధప్రతిపాధికన విబిజీ రామ్ జీ మిషన్ పేరిట మార్చి కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడానికి పూనుకున్నది అన్నారు. స్వాత్రంత్ర పోరాటల్లో కిలంగా పని చేసిన గాంధీ పేరును తొలగించి గాంధీ హంతకుడు నాథ్ రామ్ గాడ్సే పేరు ఉండేలా పూనుకోవడం బిజెపి, మోడీ లకు దేశభక్తి పై ఉన్న భక్తిని తెలియజెస్తుంది అన్నారు. పాత ఉపాధి హామీ చట్టంను తొలగించి మిషన్ గా మార్చడంలోనే వారి కుట్రలను తెలియ జెస్తుంది అన్నారు. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా అన్నీ రాజకీయ పక్షాళను కలుపుకొని పోరాడావలసిన అవసరం ఉంది అన్నారు. కేంద్రం వెంటనే విబిజీ రామ్ జీ మిషన్ వెంటనే రద్దు చేసి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఏ ఐ యు కె ఎస్ ప్రధాన కార్యదర్శి బి బాబన్న అధ్యక్షత వహించారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, ఏ ఐ పి కె ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, డీసీసీ కార్యదర్శి జీ ఎర్రన్న, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు చందర్ నాయక్, సిరికొండ సర్పంచ్ సాయి చరణ్,ఉపసర్పంచ్ శోభన్, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్, బుస జనార్దన్ ఏ ఐ యు కె కార్యదర్శి ఆర్ ఏ ఐ పి కే ఎం ఎస్ జిల్లా కార్యదర్శి ఈ రమేష్,రైతు, కార్మిక సంఘం జిల్లా నాయకులు. ఎస్ సురేష్, జి కిషన్, ఎం సాయరెడ్డి,బి కిషోర్, కిషోర్, ఆశిస్, బి కిషన్, సోసైటీ చైర్మన్ చెల్లము గంగాధర్, సంఘం జిల్లా నాయకులు బండారి నరేష్, సాయిరి నర్సయ్య, లియకత్, ఉపసర్పంచ్ రాము,తదితరులు పాల్గొన్నారు -.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల స్పష్టికరణ.

Scroll to Top