కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ.

September 9, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.9.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రముఖ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పర్సనల్ ఆఫీసర్ (PO) మరియు రీజినల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం కోసం తన రచనల ద్వారా అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్మరించుకున్నారు. ఆయన సాహిత్యం, ప్రజా చైతన్యాన్ని నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper