కాసిరెడ్డి గూడా నూతన పాలకవర్గంకు ఘన సన్మానం
సన్మానించిన సూర్య జ్యోతి కాటన్ మిల్ అంగన్వాడీ టీచర్లు
గర్భిణీ మహిళలకు శ్రీమంతం మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాలు
( పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్నగర్ మండలం కాశిరెడ్డి గూడా గ్రామపంచాయతీ పరిధిలోని సూర్య జ్యోతి కాటన్ మిల్ అంగన్వాడీ టీచర్లు మరియు ఐసిడిఎస్ అన్నారం సెట్టర్ సూపర్వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో కాశిరెడ్డి గూడ నూతన సర్పంచ్ రామలింగం గౌడ్ మరియు చింతగూడ సర్పంచ్ నరేష్ కాశిరెడ్డి గూడ డిప్యూటీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్, మరియు వార్డ్ సభ్యులు మరియు మాజీ సర్పంచ్ శంకర్ లను ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ మహిళలకు శ్రీమంతం మరియు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ హేమలత, రజిత, ఆశ వర్కర్ సుదర్శనమ్మ, మండల సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, ఐ ఎన్ టి సి ప్రెసిడెంట్ నందీశ్వర్ , యూత్ కాంగ్రెస్ మండల సెక్రెటరీ సూర్య ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
