PS Telugu News
Epaper

కిమ్స్ ప్రాంగణంలో ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు

📅 21 Feb 2026 ⏱️ 7:02 PM 📝 తెలంగాణ
Listen to this article


ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో కోనసీమ జిల్లాకు, అమలాపురానికి గర్వకారణమని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ చైతన్య రాజు అన్నారు.

ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లను ఆయన పాత్రికేయులకు వివరించారు. ​ఎన్టీఆర్ వేదిక: ఈ మహాసభల వేదికకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును ఖరారు చేశారు. ​ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏ పి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తో పాటు 20 మంది హైకోర్టు న్యాయమూర్తులు హాజరవుతున్నారని చైతన్య రాజు తెలిపారు.​ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఇప్పటికే ఆహ్వానించగా, మంగళవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.​ చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖుల ప్రసంగాలతో పాటు రెండు రోజుల్లో 8 సభలు, భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.​ముఖ్య డిమాండ్
తెలుగు భాషను కాపాడుకునే దిశగా, తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన ఈ సభల్లో ప్రధానంగా చర్చకు రానుంది​చైతన్య రాజు తెలిపారుతెలుగు భాషా పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో పాటు బాలయోగి, మెట్ల సత్యనారాయణ వంటి మహనీయుల పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై ఎమ్మెల్యే ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ కార్యక్రమం ద్వారా మరింత వన్నె వస్తుందని, తెలుగు బాషా పట్ల చైర్మన్ చైతన్య రాజు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, బోనం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top