PS Telugu News
Epaper

కుక్కల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు..

📅 07 Mar 2026 ⏱️ 7:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్ మార్చ్ 07 (పాయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి ):

కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. రుద్రూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి శుక్రవారం రాత్రి కుక్కలు కరవడంతో కాలికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రుద్రూర్ గ్రామంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తు ప్రజలపై దాడికి గురిచేస్తున్నాయి. రాత్రి సమయాలలో సైతం రోడ్లపైకి వచ్చి నడుచుకుంటూ వేళ్లే వారిపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Scroll to Top