“కుటుంబంలో విషాదం – ప్రేమ వివాహం అడ్డుకట్టగా మారిన తండ్రి కోపం!”
పయనించే సూర్యుడు న్యూస్ :.సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం నచ్చక… ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్వాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నగేష్ ను అదే గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని విఠల్ కొడుకు పాండుతో కలిసి యువకుడి తండ్రి రాములుపై దాడి చేశాడు.ఈ క్రమంలో అల్లుడి ఇంటికి తండ్రీకొడుకులు నిప్పు పెట్టారు. స్థానికులు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి, పరిస్థితిని అదుపు చేశారు. నగేష్ పిర్యాదు మేరకు తండ్రి కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.