కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో PMSBY ఆర్థిక భరోసా
పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)
తడ మండలం భీములవారి పాలెం గ్రామంలో ఎం.దేవన్ ప్రమాదశాత్తు మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పీఎంఎస్ బివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పీఎంఎస్ బివై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పీఎంఎస్ బివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య ఎం.దేశారాణి కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ యువరాజ్ మాట్లాడుతూ PMJJBY మరియు PMSBY అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ యువరాజ్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్ పండిత్,తడ వెలుగు ఏపిఎం రాజా రెడ్డి, సీసీ జనార్ధన్ మరియు బివిపాలెం సర్పంచ్ గీత ప్రకాష్ ,గ్రామపెద్ద చంద్రన్, సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం, తిరుపతి డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సతీష్ మరియు వివోఎ శివ కుమారి పాల్గొనడం జగిరింది.