PS Telugu News
Epaper

కేంద్ర బడ్జెట్ 2026 విశ్లేషణ సమావేశం మండపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగింది!

📅 07 Feb 2026 ⏱️ 7:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మండపేటలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా శాసన మండల సభ్యులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు హాజరై, కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు, వికసిత భారత్ లక్ష్యాలు, రాష్ట్రానికి, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై వివరణాత్మక విశ్లేషణ చేశారు. బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కీలక పథకాలకు బలమైన బాటలు వేస్తుందని ఆయన హైలైట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నేతలు:మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్ అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ కర్రీ చిట్టిబాబు గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ తమలంపూడి రామకృష్ణారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకరమెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కొప్పనాతి దత్తాత్రేయ, కోటిపల్లి సాయిరామ్, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు వై. శకుంతల, కోన సత్యనారాయణ, గోడవర్తి రామచంద్రరావు, శ్రీమతి వసంత. నాలుగు మండలాల అధ్యక్షులు మండపేట టౌన్, మండపేట రూరల్, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలు పణి ప్రకాష్, పాలిక రమణ, నామాల శ్రీ పద్మ, శేఖ దుర్గాప్రసాద్, మండలాల పదాధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రయోజనాలను స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం లభించింది. మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తోందని స్పష్టమైంది!

Scroll to Top