కొండారెడ్డి పల్లిలో చీరలను పంపిణి చేసిన షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.
( పయనించే సూర్యుడు నవంబర్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి ఇందిరమ్మ చీరలను అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు.ఇందిరమ్మ చీరల పంపిణిలో భాగంగా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్,సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా మహిళలకు చీరలను పంపిణి చేశారు.మాట్లాడుతూ..మండలంలోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ చీరను అందిస్తామని,ప్రస్తుతం మహిళా సంఘ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని,అనంతరం తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 సంవత్సరలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను అందిస్తామని డైరెక్టర్ కరుణాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్ తో పాటు సూరం శ్రీను,వట్టెల లింగం యాదవ్, లింగం ముదిరాజ్, సూరం శేఖర్, బుర్రి మల్లేష్,సూరం శ్రీను, పోలెపోగు రాములు, కుమ్మరి శేఖర్,శ్రీశైలం, జంగయ్య తదితరులు పాల్గొన్నారు…