కొత్త ఉపాధి బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 22 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కొత్త బిల్లును ఉపసంహరించాలని,కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సోమవారం డిమాండ్ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి జీవో కాపీలను దగ్ధం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, “వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ , మిషన్ అజీవిక గ్రామీణ్” అనే కొత్త బిల్లును తెచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ కొత్త బిల్లుతో ఉపాధి హామీ కూలీలకు లాభం ఏమి ఉండదని, సగటు వేతనం 240 రూపాయలకు తగ్గించడంతో పాటు పని దినాల హామీ బలహీనపడుతోందని విమర్శించారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచే విధంగా కేంద్రం చర్యలు తీసుకువెళ్తోందని, ఇప్పటికే రాష్ట్రానికి ప్రతి ఏడాది దాదాపు 10 వేల కోట్ల వ్యయం అవసరమయ్యే పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు తీసుకోకుండా ఈ బిల్లును ఆమోదించడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. తక్షణమే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ ప్రతాపరెడ్డి కు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బషీర్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ సిపిఐ నాయకులు గరిడీ శివన్న నబి రసూల్ రామ సుబ్బారెడ్డి శ్రీనివాసులు పెద్దరాజు సిపిఎం నాయకులు మోహన్ నారాయణ స్వామి పాల్గొన్నారు
