కొత్త రాయుడు స్వామికి గంగవరంరాజేష్ పుట్టినరోజు సందర్భంగా విరాళం.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు పంచాయతీలో స్వయంభుగా వెలసిన శ్రీ.లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి (కొత్త రాయుడు స్వామి) ధ్వజస్తంభం పునర్నిర్మాణానికి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని మన వార్తాపత్రికల్లో రావడం జరిగింది దీనికి స్పందనగా కీర్తిశేషులు గంగవరం ప్రభాకర్, సుధామని, కుమారుడు గంగవరం రాజేష్, జ్యోతి, లాలిత్య, మౌనిక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక లక్ష పదకుండువేల నూట పదహారు రూపాయలు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో చంద్రయ్య,ప్రసాదు, సురేషు, సత్యమయ్య సూరి, శ్రీధర్, పవన్ తదితరులు పాల్గొన్నారు ధ్వజ స్తంభం తయారు చేయుటకు ఆర్డరు ఇవ్వడం జరిగిందని ధ్వజస్తంభం చుట్టూ ఇత్తడి తొడుగు తోపాటు గుడి ముందరఎనిమిది పిల్లర్లతో కళ్యాణ కట్ట విస్తరణ చేయడం వేగవంతంగా జరుగుతున్న యని ఇంకా దాతలు ముందుకు వస్తే భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని కమిటీ సభ్యులు తెలియజేశారు
