కొత్త సూగయ్య, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి..
ఉచిత మజ్జిగ, అంబలి కేంద్రం ప్రారంభించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి…
:పయనించే సూర్యుడు: :ఏప్రిల్ 1 మక్తల్:
కొత్తసూగయ్య, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 28వ సంవత్సర వార్షిక మజ్జిగ అంబలి కేంద్రంను మఖ్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డెయిరీ క్రీడా మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చేతుల మంగళవారం ప్రారంభించారు. కొత్త సూర్యనారాయణగుప్తా ఆధ్వర్యంలో సోదరులు కొత్త శ్రీనివాస్ గుప్తా, కొత్త జగదీశ్ గుప్తా, కొత్త నర్సిములు గుప్తా, డాక్టర్ కిరణ్ తదితరుల సమక్షంలో కొత్తసూగయ్య, రత్నమ్మ చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, ప్రజలకు ఉచిత మజ్జిగ, అంబలి కేంద్రంను ప్రారంబించారు. గత 27 సంవత్సరాల నుంచి అంబలికేంద్రంను మఖ్తల్ పట్టణంలో కొత్త సూగయ్య, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, దీంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. బీదవారి పెళ్లిళ్లకు, పుస్తెలు, మెట్టలు, బట్టలు, బియ్యం తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నామని కొత్త సూర్యనారాయణ గుప్తా తెలిపారు. పేదవిద్యార్థులు చదువుకునేందుకు ఆర్థికసాయం సైతం అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సేవాకార్యక్రమాలు చేపడుతున్న కొత్త సూర్యనారాయణగుప్తా, సోదరులకు పలువురు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నేతలు బాలక్రిష్ణారెడ్డి,లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, బి.చంద్రకాంత్ గౌడ్, బి కొండయ్య, రాజుల ఆశిరెడ్డి , గణేష్, కట్టా సురేశ్ గుప్తా, కోళ్ల వెంకటేశ్, దేవరింటి నరసింహారెడ్డి, గోలపల్లి నారాయణ, చిన్న హనుమంతు, బి. నర్సింలు, అన్వర్, మనన్, కావలి ఆంజనేయులు, వల్లంపల్లి లక్ష్మణ్, నీలప్ప, రహీంపటేల్, పి.రంజిత్ రెడ్డి ,శుభోదయ రాములు, మందుల నరేందర్, రవికుమార్, అమర్, కల్లూరి గోవర్దన్, చందాపూర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.

