PS Telugu News
Epaper

కోట పోలూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరు

📅 20 Mar 2026 ⏱️ 2:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామం పడమటి హరిజన వాడ లో తాగునీటి కోసం ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంకు లో ప్రతిరోజు కోతులు కాకులు జల కాలాడుతున్నాయి ఆ నీటిని ప్రజలకి మళ్ళీ సరఫరా చేస్తున్నారు ఆ కలుషిత నీళ్లు తాగటం వల్ల ప్రజలకి వాంతులు విరోచనాలు అవుతున్నాయి కానీ నీటిని సరఫరా చేసే అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించటం లేదు ఆ ట్యాంక్ పైన మూతని ఏర్పాటు చేస్తే ఆ ట్యాంకు లోపలికి కోతులు గాని కాకలు గాని వెళ్ళవు అని కూడా అధికారులకు తెలియట్లేదు అక్కడున్న గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికారులకు తెలియదా ఆ ట్యాంక్ నీ శుభ్రం చేసి ఆ ట్యాంకు పైన మూత వేసి స్వచ్ఛమైన వాటర్ ని ప్రజలకు అందించాలని అక్కడున్న ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్లకి ఉన్న బాధని సమస్యని ఇంకెవరికి చెప్పుకోవాలి మహాప్రభు అని కోట పోలూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Scroll to Top