కోడ్ ముగిసినా తొలగని ముసుగులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు మాత్రం తొలగించడం లో నిర్లక్ష్యం . కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నా
రాజకీయ నాయకుల విగ్రహాలు మరియు శంకుస్థాపన శిలాఫలకాలపై అధికారులు ముసుగులు మాత్రం తొలగించడం లేదు. స్థానిక ఎన్నికలకు ఈ నెల 17న ఫలితాలు వెళ్లడయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసిన ఇన్ని రోజులు గడుస్తున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండలంలో నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగు తొలగింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఖమ్మం జిల్లా అధికారులు మండల అధికారులు మాత్రం చోద్యం చూస్తూ కాలం గడుపుతున్నారు.