PS Telugu News
Epaper

క్రీడలతోనే మానసిక ఉల్లాసం సాధ్యం

📅 29 Aug 2025 ⏱️ 6:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. కమల

ప్రముఖ చదరంగం క్రీడాకారుడు వానరసి జగన్ హాజరు

( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం శుక్రవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపల్ యల్. కమలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని అందించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ చదరంగం క్రీడాకారుడు వానరసి జగన్ హాజరయ్యారు. క్రీడా అధ్యాపకురాలు నదిరా నేతృత్వంలో విద్యార్థుల కోసం చెస్, క్యారమ్స్, వాలీబాల్, కో,కో, కబడ్డీ, క్రికెట్, అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడల్లో పోటీలు అద్భుతంగా తమ ప్రతిభ చాటారు. అనంతరం విజేతలకు విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రిన్సిపల్ కమలా, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, క్రీడాకారుడు జగన్ సంయుక్తంగా బహుమతులు అందజేశారు.చదరంగం కోచ్ జగన్ మాట్లాడుతూ…చదరంగం కేవలం ఆట కాదు, అది మానసిక సామర్థ్యాన్ని పెంపొందించే ‘మేధో వ్యాయామం’. ప్రతి కదలికలో ముందుచూపు, సహనం, వ్యూహాత్మక ఆలోచన అవసరం. ఈ క్రీడ జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన క్రమశిక్షణ, ఏకాగ్రత, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని అందిస్తుంది” అని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి, కళాశాలకు కీర్తిని తీసుకురావాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, ఉత్సాహాన్ని రగిలించింది.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు డాక్టర్ శాంతి, జ్యోతి, దేవయ్య, యాదయ్య, జయ, అరుణ, సుష్మ, చామంతి, కృష్ణవేణి, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు..

Scroll to Top