క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసిన రాయికల్ శ్రీనివాస్
( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్‌తో పాటు, ఏలికట్ట సర్పంచ్ వాకిటి నవకిరణి బుడ్డ నర్సింహ ముదిరాజ్, దేవునిపల్లి సర్పంచ్ కుర్వ లలిత మల్లేష్, చేగురు సర్పంచ్ మంకల శ్రీశైలం ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ తుపాకుల శేఖర్ ముదిరాజ్, నర్సింహ ముదిరాజ్ తదితరులు క్రీడా శాఖ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామీణ యువతకు క్రీడా రంగంలో అవకాశాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ స్థాయిలో క్రీడా మైదానాల అభివృద్ధి, యువతకు శిక్షణా కేంద్రాల ఏర్పాటు, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధానాలు అమలు చేయాలని వారు కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వసతులు, మార్గనిర్దేశం లేక వెనుకబడుతున్నారని పేర్కొంటూ, పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ, గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
