PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

దేశంలో మరో రైలు ప్రమాదం.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు

పయనించే సూర్యుడు న్యూస్ :దక్షిణ మెక్సికో దేశంలోని ఓక్సాకా రాష్ట్రంలో ఆదివారం (డిసెంబర్‌ 28) ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాండా సిటీలో ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించగా.. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన ఈ రైలులో తొమ్మిది మంది సిబ్బంది సహా 241 మంది ప్రయాణికులతో కలిపి 250 మంది ఉన్నట్లు మెక్సికన్ స్థానిక మీడియా సంస్థ […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

రైల్వే భద్రతలో లోపమా? ఎర్నాకుళం రైలులో అగ్ని ప్రమాదం

పయనించే సూర్యుడు న్యూస్ :టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి SP తుహిన్ సిన్హా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ్యక్తి 71 సంవత్సరాల వ్యక్తని, పెద్ద వయసుకావడంతో ఆయన బయటికి రాలేకపోయారని SP తెలిపారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించామని, వేరే ట్రైన్‌ కూడా ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం పంపించామన్నారు.

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేతిలో భార్య హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు

పయనించే సూర్యుడు న్యూస్ :బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ ఇంజనీర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.బాధితురాలు భువనేశ్వరి (39) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వరనగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

క్రైమ్-న్యూస్

భార్య, పిల్లలపై కిరాతకుడి 18 ఏళ్ల వేధింపుల దృశ్యం బయటపడ్డ ఘోరం

పయనించే సూర్యుడు న్యూస్ :ఆధునిక సమాజంలోనూ మత నియమాల పేరుతో కొంతమంది దారుణాలకు ఒడిగడుతున్నారు. బుర్ఖా ధరించలేదనే కోపంతో ఓ వ్యక్తి తన భార్యను, అడ్డువచ్చిన ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా చంపి, ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. వంటవాడిగా పనిచేసే ఫరూఖ్ అనే వ్యక్తికి అత్యంత ఛాందసభావాలు ఉన్నాయి. తన భార్య తాహిరా ఎప్పుడూ బుర్ఖా ధరించాలని అతను వేధించేవాడు. కేవలం

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

రెంట్ కోసం వెళ్లి తిరిగి రాని ఓనర్.. ఆలస్యంగా బయటపడిన భయంకర నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా రెంట్ అడగడానికి వచ్చిన ఓనర్‌కి.. మన దగ్గర రెంట్ లేకపోతే ఏం చెబుతాం.! రెండు లేదా మూడు రోజుల్లో చూసి రెంట్ ఇచ్చేస్తాం. లేదా ఇదిగో రెంట్ అని పట్టుకొచ్చి డబ్బులు ఇస్తాం. కానీ ఇక్కడొక జంట.. కిలాడీ భార్యాభర్తలు ఏం చేశారో తెలిస్తే..! వివరాల్లోకి వెళ్తే.. రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్‌ను చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓరా కైమోరా సొసైటీలో

Scroll to Top