ఖమ్మం విద్యా శాఖలో అవినీతి పాఠాలు

అటెండర్ నుంచి డీఈవో వరకు అక్రమాలు**జిల్లాలో రెగ్యులర్ ఎంఈవోల కరవు* *జిల్లా కలెక్టర్ పనితీరు కూడా ఏమీ బాగో లేనట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి*
పయనించే సూర్యుడు డిసెంబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ అధికారుల పనితీరుప్రభుత్వం ఒకవైపు విద్యా శాఖను ప్రక్షాళన చేస్తున్నామని చెబుతుంటే క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దండుకుంటూ విద్యా వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు.ఖమ్మం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ అప్రతిష్ఠ పాలుచేస్తున్నారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం నాయకులు విద్యాశాఖ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.గతంలో పని చేసిన అధికారులు ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో పెద్ద మెత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల సర్దుబాటులో సైతం అనుకూలంగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి.ప్రైవేట్ పాఠశాలల అనుమతి పునరుద్ధరణ (రెన్యువల్)కు కార్యాలయానికి వెళ్తే మామూళ్లు చెల్లించనిదే పనులు పూర్తి కావనే ఆరోపణలున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు ఇందుకు సంవత్సరానికి లక్ష రూపాయలలో చెల్లించినట్లు వాపోయారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాఠశాలను విడిచి వెళ్లే క్రమంలో పైచదువులకు బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) తప్పనిసరి. దీనిని విద్యా శాఖ బుక్కుల రూపంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి రూ.500 తీసుకొని జారీ చేస్తోంది. కానీ సిబ్బంది ఇదే అదునుగా రూ.3 వేలకుపైగా వసూలు చేస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల యజమానులు చెబుతున్నారు. దీంతో యాజమాన్యాలు కూడా విద్యార్థుల నుంచి రూ.500 నుంచి రూ.వేయి వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంపై కలెక్టర్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో 500 కుపైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇవి విద్యా శాఖకు ఆదాయ వనరుగా మారాయి. చాలా పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందిజిల్లాలో రెగ్యులర్ ఎంఈవోల కరవుజిల్లాలో రెగ్యులర్ ఎంఈవో లేరు. మండలంలోని సీనియర్ ఉపాధ్యాయులకే ఎంఈవో బాధ్యతలు అప్పగించారు. అందరూ ఇన్‌ఛార్జిలే కావడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్య శాఖ నుండి ఫైల్స్ డీఈవో ఆఫీస్ కి వచ్చిన వాటిని అప్లై చేసుకున్న ఉద్యోగులకి ఇవ్వడానికి లేదా తర్వాత ప్రాసెసింగ్ కి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు… ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం గా సమాధానం చెప్తున్నారువిద్యాశాఖలో ఇప్పటికైనా మార్పులు చేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు జిల్లా కలెక్టర్ పనితీరు కూడా ఏమీ బాగోలేనట్టుగా జిల్లా వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజా సమస్యలను పట్టించుకునే నాధుడే లేడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదు మాటలకే పరిమితం అవుతున్న ఉన్నతాధికారుల పనితీరు పని దగ్గరకు వచ్చేసరికి లంచాలు ఇవ్వాల్సిందే మరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లోపం కూడా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నట్టుగా జిల్లా ప్రజలు వాపోతున్నారు