PS Telugu News
Epaper

గాంధారి మండలం చద్మల్ వెళ్ళు రహదారి పై గుర్తు తెలియని మగ వ్యక్తి హత్య

📅 16 Oct 2025 ⏱️ 4:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 17/10/25

గాంధారి మండల కేంద్రం నుండి చద్మల్ కు వెళ్లే దారి శివారు లో రహదారి పక్కన గల గుంతలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తిని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపి మీద పెట్రోల్ పోసి అంటు పెట్టినట్లు కనపడుతూ, శవం పాక్షికంగా కాలిపోయినట్లుగా కనబడుతున్నది. అట్టి వ్యక్తి వయస్సు అందాజ 30 సంవత్సరాలు ఉండియుండి, ఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలు, రంగు: నలుపు రంగు, శరీరం పైన నీలిరంగు జీన్స్ ప్యాంటు, తెల్లని బనీయన్ మరియు నలుపు రంగు గీతలు గల తెల్లని చొక్కా కలిగి ఉన్నారు. శవాన్ని ఎవరైనా గుర్తుపట్టిన, ఎవరైనా మిస్ అయినట్లయితే ఈ కింది నెంబర్లకు ఫోన్ చేయగలరు. ఎస్ఐ గాంధారి 8712686165 సిఐ సదాశివ నగర్8712686163 PS గాంధారి 8712666228 కి తెలపరూ

Scroll to Top