గాంధారి లో ఒక ఇంట్లో దొంగతనం
పయనించే సూర్యుడు గాంధారి 07/10/25
గాంధారి మండల కేంద్రంలో గల బాలు మెకానిక్ షాప్ పైన నివసిస్తున్న బర్ధావల్ బాలు అనే వ్యక్తి నిన్న రాత్రి అందజా 08.00 గంటలకి తన షాపు మరియు ఇంటికి తాళం వేసి తన అత్తగారైన బీర్మల్ తండా గ్రామంలో పండుగ ఉన్నందున వెళ్లి ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి లోపల గల బీరువాను డ్యామేజ్ చేసి దాంట్లో గల ఒక తులం రెండు జతల బంగారు కమ్మలు మరియు 60 తులాల వెండి మరియు నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసుకొని వెళ్ళినారు అని, మెకానిక్ బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారూ