గుడి నిర్మాణానికి విరాళాలు సేకరణ
లక్ష్మీదేవుని పల్లి హనుమాన్ మరియు శివాలయం నిర్మాణానికి విరాళాలు
( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్ శివాలయ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఈరోజు పలువురు భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు.వివరాలు:-చెక్కల గోవింద్ రూ.11,000/-,చెక్కల రమేష్ రూ.11,000/-,
చెక్కల సుధాకర్ రూ.11,011/-,చిలుకూరి లింగం గౌడ్ రూ.11,000/-,కేతావత్ రవినాయక్ రూ.11,011/-,
రాఘవేందర్ గౌడ్ రూ.6,001/-,మెకానిక్ శ్రీకాంత్ రూ.2,100/-,కొలుముల యాదయ్య రూ.1,500/-
విరాళంగా ఆలయానికి అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గ్రామ దేవాలయాల అభివృద్ధికి ఇటువంటి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భగవంతుడి ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.