PS Telugu News
Epaper

గురునాథ్ రెడ్డి పై అట్రాసిటీ తో పాటు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి.

📅 28 Mar 2026 ⏱️ 5:07 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జిల్లా SP మరియు CWC చైర్మన్ లకు ఫిర్యాదు చేసిన ప్రజా సంఘాల నాయకులు.

{పయనించే సూర్యుడు} {మార్చు 29 }

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమిన్ పూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు స్వామి చేసిన అసభ్య ప్రవర్తనను సీసీ కెమెరాలో రికార్డు చేసి ఆ అమ్మాయి ముఖాన్ని బ్లర్ చేయకుండా పదవ తరగతి అబ్బాయిలకు,సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆ అమ్మాయి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించడంతోపాటు, అమ్మాయి భవిష్యత్తును నాశనం చేసేవిధంగా వ్యవహరించినా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డిపై కూడా ఫోక్సో కేసును మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు అధికారి కి, జిల్లా సి. డబ్ల్యూ.సి చైర్మన్ కి ఫిర్యాదులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తల్వార్ నరేష్ రవికుమార్ లు పాల్గొన్నారు.

Scroll to Top