PS Telugu News
Epaper

గొల్లపల్లిలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

📅 25 Nov 2025 ⏱️ 2:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

” “పయనించే సూర్యుడు నవంబర్ 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం స్పెషల్ క్యాంప్ కార్యక్రమాన్ని చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం గొల్లపల్లి గ్రామంలో వారం రోజులు 25వ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు జరుగుతుందని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కామర్స్ లెక్చరర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్. లక్ష్మీ జ్ఞానేశ్వరి. విద్యార్థులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం విద్యార్థుల్లో సేవ దృక్పథం పెంపొందించడమే ప్రధాన లక్ష్మణ్ ఇలాంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో విద్యార్థుల్లో శ్రమ సేవ గుణాలు కష్టపడే తత్వం అలవాడతాయని దీని ద్వారా ప్రజాసేవ దేశభక్తి మొదల గుణాలు అభివృద్ధి చెందతాయని తెలిపారు అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ కలిగిన భావి భారత పౌరులుగా ఎదుగుతారని తెలియజేశారు అనంతరం విద్యార్థుల చేత ఎన్ఎస్ఎస్ స్వచ్ఛఆంధ్ర ప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడత హాజరత్తయ్య . అంగనవాడి కార్యకర్త పి పద్మ. కళాశాల అధ్యాపకులు . విద్యార్థి విద్యార్థులు. స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top