PS Telugu News
Epaper

గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

📅 01 Dec 2025 ⏱️ 12:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

” పయనించే సూర్యుడు డిసెంబర్ 1

(ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి

తిరుపతయ్య)ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి సూచనతో మరియు ఆత్మకూర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత హజరత్తయ్య చేతుల మీదుగా పెన్షన్ల లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఉడత. హజరత్తయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వృద్ధులకు. వితంతులకు వికలాంగులకు. రకరకాల పెన్షన్లు ఒకటవ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు యువకులు. సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Scroll to Top