“గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల పరిశీలించిన ఎంఈఓ
పయనించే సూర్యుడు డిసెంబర్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం గొల్లపల్లి తూర్పు కాలనీ ప్రాథమిక పాఠశాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి డి మస్తానయ్య పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల తేలికపాటి వర్షాలు వచ్చిన విద్యార్థి విద్యార్థులు నేల కూర్చుని చదువుకునే పరిస్థితి కూడా లేదని పై స్లాబ్ నుండి బ్లేచ్లు ఊడి విద్యార్థి విద్యార్థులు పై న పడతాయని తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి తెలిపారు స్పందించిన మండల విద్యాశాఖ అధికారి జిల్లా ఉన్నతాధికారులకు తెలుపుతామని ఆయన పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఆయన వెంట ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు