గ్రామంలో వార్డులో పర్యటించిన నూతన సర్పంచ్ రాంచందర్
//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 27// నారాయణపేట జిల్లా బ్యూరో//
నారాయణపేట మండలం బండగుండ గ్రామ నూతన సర్పంచ్ రామచందర్ గ్రామంలోని వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, ఆ వార్డులో ప్రజలతో మమేకమై వారిద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, వారికి హామీ ఇచ్చారు, గ్రామంలో ఏసమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధిని సాధించుకుందామని ఆయన అన్నారు, వార్డుల్లో పర్యటిస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకొని , ముఖ్యంగా కొన్ని వార్డుల్లో మిషన్ భగీరథ మంచినీటి సమస్య ఉండటంతో, దానికి సంబంధించి ఏ ఈతో మాట్లాడి పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల గురించి కూడా తెలుసుకున్నారు, అర్హులు ఎవరు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వారికి ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తానని, అన్నారు, గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు, ప్రజలు కూడా ఇలాంటి సర్పంచులు కావాలని,ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు, వార్డు సభ్యులు, ప్రజలు ఉన్నారు
