గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన…రుద్రూర్,
డిసెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్టటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు మంగళ హారతులతో శోభయాత్ర కొనసాగిస్తూ గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.