PS Telugu News
Epaper

గ్రామాల అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం

📅 15 Dec 2025 ⏱️ 1:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

గ్రామాల అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం

అజ్మీర సురేష్ నాయక్

ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరు

అజ్మీర సురేష్ నాయక్ ను గెలిపించండి గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత నాది వైరా శాసనసభ్యులు మలోత్ రాందాస్ నాయక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

రేపల్లెవాడ గ్రామా అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధికి గాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ప్రతి పేదవానికి ఇవ్వడం జరిగింది
అర్హత కలిగిన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాది వైరా శాసనసభ్యులు
మలోత్ రాందాస్ నాయక్ అన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అజ్మీర సురేష్ నాయక్
ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి రేపల్లెవాడ గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనీ, గ్రామ గ్రామాభివృద్ధికి గాను ప్రతీ ఒక్కరూ అజ్మీర సురేష్ నాయక్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఉచితంగా బస్ ప్రయాణం, ఉచిత గ్యాస్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, ఉచితంగా గృహజ్యోతి, తదితర పథకాలు ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు అందుతున్నాయని అన్నారు. మహిళ అభివృద్ది చెందడం అంటే యావత్ కుటుంబం అభివృద్ధి చెందినట్టేనని అన్నారు. మహిళా మణులకు ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళలను మహరాణులు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అజ్మీర సురేష్ నాయక్ గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి మహిళలను కలుస్తూ బొట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అజ్మీర సురేష్ నాయక్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Scroll to Top