PS Telugu News
Epaper

గ్రామీణ వైద్యులు పరిధికి మించి వైద్యం చేయరాదు జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు

📅 07 Oct 2025 ⏱️ 6:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి :సులానగర్ పీహెచ్సీలో ఆర్.ఎం.పి పిఎంపి గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లాఅడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు పాల్గొని ఆర్ఎంపీ పి.ఎం.పి వైద్యులకు పలు సూచనలు చేశారు టేకులపల్లి మండలంలో డెంగ్యూ జ్వరాలు , మలేరియా జ్వరాలు వస్తే దగ్గరలోని పీహెచ్సీకి రెఫర్ చేయాలని సూచించారు స్థిరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వాడరాదని చిన్నపిల్లలకు ఇంజక్షన్స్ వాడొద్దని అబార్షన్స్ చేయరాదని పరిధికి మించి వైద్యం చేయరాదని సులానగర్ పిహెచ్ సి పరిధిలో యాంటీ రేబీస్ ఇంజక్షన్స్ యాంటీ స్నేక్ వినం ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయని అలాంటి పేషెంట్స్ గ్రామీణ వైద్యుల దగ్గరికి వస్తే అత్యవసరంగా సులానగర్ పిహెచ్ సి కి వెంటనే పంపించాలని సూచించారు నిత్యం గ్రామీణ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు రకాల సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు సి హెచ్ ఓ పార్వతి ఆరోగ్య విస్తరణ అధికారి దేవా లింగయ్య పాయం శ్రీను సిహెచ్ఎన్ చంద్రకళ విజయ వెంకటేశ్వర్లు కౌసల్య. స్పర్శ తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొనకంటి ఉపేందర్ రావు టేకులపల్లిమండల అధ్యక్షులు (నటరాజ్. గ్రామీణ వైద్యుల సహాయక సంఘం )ఎస్కే పాషా ఎండీ యాకుబ్ పాషా రఫీ సత్యనారాయణ శ్యామ్ ఖాదర్ బాబా ప్రసాద్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top