
( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీ నడికూడ శ్రీశైలం గారి తండ్రి, ఎల్లయ్యగారి జ్ఞానేశ్వర్ గార్ల తండ్రి మరియు కుమ్మరిగూడెం సాయిబాబా తల్లి గార్ల జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య రోజున మొల్లమాంబ విగ్రహం ముందు ఎంపీడీఓ ఆఫీస్, షాద్ నగర్, హైదరాబాద్ రోడ్ లో అన్న దాన విక్రయం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంతో మంది ఆకలి తో బాధ పడే నిరుపేదలు పాల్గొని వాళ్ళ వాల ఆకలి తీర్చుకోవడం జరుగుతుంది . ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కుమ్మరి సంఘం అధ్యక్షుల వారికి మరియు అన్నదాన కార్యక్రమానికి తోడ్పడుతున్న సంఘం నాయకులకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రజలకు షాద్ నగర్ నియోజకవర్గం కుమ్మరి సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు…