PS Telugu News
Epaper

ఘనంగా కూకట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు కర్క నాగరాజు జన్మదిన వేడుకలు

📅 11 Apr 2026 ⏱️ 4:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, ఐఎన్‌టీయూసీ కూకట్పల్లి అధ్యక్షుడు కర్క నాగరాజు జన్మదిన వేడుకలు శనివారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ హాజరై నాగరాజుకు పూలమాల వేసి, శాలువా కప్పి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్క నాగరాజు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం అంతటా నాయకులు, కార్యకర్తలు నాగరాజుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ పట్ల ఆయన అంకితభావాన్ని కొనియాడుతూ పలువురు నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కర్క పెంటయ్య, లక్ష్మయ్య, తూము వేణు, ప్రతాప్ రెడ్డి, పుష్ప రెడ్డి, గంధం రాజు, కొప్పిశెట్టి దినేష్, తూము సంతోష్, శివ చౌదరి, ఇజాజ్, అస్లాం, గోపాల్ చౌదరి, బాలరాజు, అక్బర్, శేఖర్, శివా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top